పంచాయతీలకు తీపి కబురు
15వ ఆర్థిక సంఘం కింద రూ.387 కోట్ల నిధులు విడుదల
On
హైదరాబాద్, (నేటి ఫోకస్ న్యూస్)-ఫిబ్రవరి 12 : తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు మరోసారి తీపి కబురు అందింది. 15వ ఆర్థిక సంఘం కింద ఈనెల 5న తొలి విడతలో కేంద్ర ప్రభుత్వం రూ.259.36 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా మరో రూ.387 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, పంచాయతీలకు పాలక వర్గాలు ఏర్పాటు అయ్యి రెండు నెలల అవుతుంది. నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న గ్రామ పంచాయతీలకు ఈ నిధుల విడుదల ఊరట కలిగిస్తోంది. మొత్తంగా కేంద్రం నుంచి 15వ ఆర్థికసంఘం నిధులు ఇంకా రూ.2400 కోట్ల వరకు రావాల్సి ఉంది. ఈ మొత్తాన్ని విడతలవారీగా 2026 మార్చి 31నాటికి చెల్లించే అవకాశం ఉన్నట్టు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు వెల్లడించారు.
Tags:
