ఫర్హాన్ శతక మోత
సూపర్ 8లోకి పాకిస్తాన్ నాకౌట్ ఆశలు సజీవం
పొట్టి ప్రపంచకప్‌లో భారత జట్టు చేతిలో కంగుతిన్న పాకిస్థాన్ నాకౌట్ ఆశల్ని నిలబెట్టుకుంది. చివరి లీగ్ మ్యాచ్‌లో నమీబియాపై భారీ స్కోర్ చేసిన పాక్ సునాయస విజయంతో సూపర్ 8కు దూసుకెళ్లింది. ఓపెనర్ షహిబ్జద ఫర్హాన్(100) సెంచరీతో కదం తొక్కగా.. ఉస్మాన్ తారీఖ్(4-16), షాదాబ్ ఖాన్(3-19)లు వికెట్ల వేటతో చెలరేగాడు. 200 పరుగుల ఛేదనలో పసికూనను పడగొట్టింది. నాకౌట్ దశలో ఆతిథ్య శ్రీలంక, ఇంగ్లండ్, వెస్టిండీస్‌లతో అమీతుమీకి సిద్ధమైంది. తొమ్మిదో సీజన్‌లో గ్రూప్ దశలోనే వెనుదిరిగిన పాకిస్థాన్ ఈసారి బతికిపోయింది. గ్రూప్ ఏ చివరి లీగ్ మ్యాచ్‌లో నమీబియాను ఓడించి సూపర్ 8కు అర్హత సాధించింది. ఓపెనర్ షహిబ్జద ఫర్హాన్(100) మెరుపు సెంచరీకి.. మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారీఖ్(4-16) మ్యాజిక్ తోడవ్వగా 102 పరుగుల తేడాతో నమీబియాను మట్టికరిపించింది పాక్. దాంతో, గ్రూప్ ఏ నుంచి సూపర్ 8 బెర్తు పట్టేసింది. పాక్ గెలుపొందడంతో రెండోసారి నాకౌట్‌లో ఆడాలనుకున్న యూఎస్‌ఏ ఆశలు ఆవిరయ్యాయి.

ఫర్హాన్ శతక మోత