BREAKING: పల్నాడులో భూకంపం

రిక్టరు స్కేలుపై 3.5 తీవ్రత నమోదు

BREAKING: పల్నాడులో భూకంపం

పల్నాడు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పల్నాడులో స్వల్ప భూకంపం సంభవించింది. వినుకొండకు 20 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టరు స్కేలుపై 3.5 తీవ్రత నమోదయినట్లు ఈఎంఎస్సి, ఎన్‌సిఎస్ ధ్రువీకరించాయి. వినుకొండ, దర్శితో పాటు పలు ప్రాంతాల్లో భూమి కంపించగా.. ఇంట్లోని వస్తువులు కుదుపునకు గురయ్యాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. 

33

Tags: