కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్‌

ఐదుగురు మావోయిస్టులు హతం

కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్‌

ఛత్తీస్గఢ్‌/రాయపూర్‌, ఫిబ్రవరి 19: ఛత్తీస్గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. మావోయిస్టు అగ్రనేత, ఆ పార్టీ కార్యదర్శి దేవ్‌ జీ లక్ష్యంగా కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్‌ చేపట్టగా మావోయిస్టులు తారసపడ్డారు. విషయాన్ని గమనించి భద్రతా బలగాలపైకి మావోయిస్టులు కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు సైతం ఎదురుకాల్పులకు దిగాయి. కొద్దిసేపటి తర్వాత ఆ ప్రాంతంలో ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు గుర్తించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భద్రతా బలగాలు వెల్లడించాయి. మృతుల్లో అగ్రనేతలు ఉండవచ్చని భద్రతా దళాలు భావిస్తున్నాయి. కాగా, మధ్యప్రదేశ్‌ నుంచి కర్రెగుట్టల్లోకి మావోలు ప్రవేశించారంటూ నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతా బలగాలు.. ఈ ప్రాంతంలో కూంబింగ్‌ చేపట్టాయి. మరోవైపు దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌ గడువు మరికొన్ని రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో లక్ష్యం దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.

కర్రెగుట్టలో ఆపరేషన్‌-2 కగార్‌ ప్రారంభం

  • మావోయిస్టు అగ్రనేతలు టార్గెట్‌గా ఆపరేషన్‌-2 కగార్‌

  • తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యం

  • కర్రెగుట్టలో తలదాచుకున్న మావోయిస్టు అగ్రనేతలు

  • 5 వేల మంది CRPF బలగాలతో కూంబింగ్‌

  • లొంగుబాటుకు సిద్ధమవుతున్న అగ్రనేతలు

  • 40 రోజులే మిగిలివున్న ఆపరేషన్‌ కగార్‌ డెడ్‌లైన్‌

3

Tags: