Suryapet Crime: ప్రేమోన్మాది ఘాతుకం
తనని దూరం పెడుతోందని.. సుత్తెతో దాడి
On
సూర్యాపేట, ఫిబ్రవరి 19: సూర్యాపేట జిల్లా స్నేహ నగర్ కాలనీలో దారుణం జరిగింది. గత కొంతకాలంగా ఓ యువకుడు ఓ యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అయితే, సదరు యువతి అతడిని దూరం పెడుతుండటంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. గురువారం యువతి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆమెపై సుత్తెతో దాడికి పాల్పడ్డాడు. తలకు తీవ్ర గాయాలై స్పృహ కోల్పోయిన యువతిని స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కి తరలించారు. నిందితుడిని స్థానికులు పట్టుకుని విద్యుత్ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న సూర్యాపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకుని హత్యాయత్నం, వేధింపులు వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు తెలుస్తోంది.

Tags:
