Bee Attack: క్రికెటర్లపై తేనెటీగల దాడి
అంపైర్ మృతి, 20 మంది ప్లేయర్లకు గాయాలు
ఉన్నావ్: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో క్రికెటర్లపై తేనెటీగలు దాడి చేసిన ఘటనలో అంపైర్ మానిక్ గుప్తా(65ఏళ్లు) మృతిచెందినట్లు కాన్పూర్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. శుక్లాగంజ్ ఏరియాలోని సప్రూ మైదాన్‌లో జరిగిన ఈ ఘటనలో మరో 20మంది క్రికెటర్లకూ గాయాలయ్యాయి. కాన్పూర్‌కు చెందిన మానిక్ గుప్తా క్రికెట్ మ్యాచ్‌కు అంపైరింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా తేనెటీగలు దాడి చేశాయి. మానిక్ గుప్తాకు ముఖం, శరీరంపై తీవ్ర గాయాలు కాగా.. అక్కడే కుప్పకూలి స్పహృ కోల్పోయాడు. తొలుత శుక్లాగంజ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కాన్పూర్‌లోని లాలా లజ్‌పత్ రాయ్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. తేనటీగల దాడిలో మరో అంపైర్ కూడా గాయపడ్డారు. కాన్పూర్ క్రికెట్ సంఘం ప్రెసిడెఒంట్ ఎస్ఎన్ సింగ్ తన ప్రకటనలో అంపైర్ మానిక్ గుప్తా మృతిని ద్రువీకరించారు.

