‘ఏఐ సమ్మిట్‌’లో మోడీ బిజీబిజీ

ఒక్కరోజే ఏడుగురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు

రెండు కంపెనీల సీఈవోలతో భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ‘ఏఐ ఇంపాక్ట్‍ సమ్మిట్‌’ సందర్భంగా బిజీబిజీ అయ్యారు. బుధవారం ఒక్కరోజే ఏడు దేశాల అధ్యక్షులు, ప్రధానులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రెండు కంపెనీల సీఈవోలతో భేటీ అయ్యారు. సమ్మిట్‌లో పాల్గొనేందుకు ఢిల్లీకి చేరుకున్న ప్రధాని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ గుటెర్రెస్, ఐఎంఎఫ్‌ ఎండీ క్రిష్టినా జార్జియేవా, శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే, భూటాన్‌ ప్రధాని త్సెరింగ్‌ తోబ్‌గే, మారిషస్ ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గూలమ్‌, క్రొయేషియా ప్రధాని ఆండ్రెజ్‌ ప్లెంకోవిక్‌, సెర్బియా అధ్యక్షుడు అలెక్సాండర్‌ వుసిస్, స్పెయిన్‌ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్‌, ఫిన్‌లాండ్‌ ప్రధానమంత్రి పీటెరి ఆర్పో, ఎస్తోనియా అధ్యక్షుడు అలార్‌ కరిస్, షీసెల్స్​‍ ఉపాధ్యక్షుడు సెబాస్టియన్‌ పిల్లే, గ్రీస్ ప్రధాని కైరియాకోస్ మిట్సోటకిస్ గుయానా ఉపాధ్యక్షుడు భార్రత్‌ జగ్దేవ్‌ తదితరులకు స్వాగతం పలికారు. ఏడుగురు దేశాధినేతలతో వేర్వేరుగా సమావేశమైౖ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రపంచ దిగ్గజ టెక్నాలజీ సంస్థ గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌, కోస్లా వెంచర్స్​‍ సహ వ్యవస్థాపకుడు వినోద్‌ ఖోస్లాతో ఏఐ ఇంపాక్ట్‍ సమ్మిట్‌ జరుగుతున్న భారత్‌ మండపంలో సమావేశమయ్యారు. ఈ సదస్సుకు విచ్చేసిన దేశాధినేతలు, కంపెనీల సీఈవోలు, ప్రతినిధులకు ప్రధాని బుధవారం రాత్రి విందు ఇచ్చారు. ప్రధాని గురువారం ఏఐ సమ్మిట్‌లో ప్రసంగించనున్నారు.

23

Tags: