BREAKING: ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం

గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు సమీపంలో ఘటన

20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు

హైదరాబాద్‌ నుంచి అనంతపురం వెళ్తుండగా ప్రమాదం

123 copy
ఫొటో: ఘటనాస్థలి వద్ద బస్సు ప్రమాదం దృశ్యం


గద్వాల/ఫోకస్ న్యూస్: గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు సమీపంలో గురువారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి అనంతపురం వెళ్తుండగా ఇటిక్యాలపాడు సమీపంలో బస్సు గుంతలో పడి అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పలువురికి కాళ్లు, చేతులు విరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 వాహనాల్లో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Tags: